TV77తెలుగు గుంటూరు:
ఓ దాడి కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తోన్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు సతమతమవుతున్నారు. మంగళగిరిలో ఇద్దరు యువకులపై ఓ గ్యాంగ్ దాడికి పాల్పడింది. రాడ్‌లు, కర్రలతో గ్యాంగ్ దాడి చేసింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేయవద్దని ఓ అధికార పార్టీ నుంచి ఒత్తిడి వస్తోంది. కేసు పెట్టాలంటూ మరో అధికార పార్టీ నేత నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.