TV77తెలుగు అమెరికా / మెక్సికో :
అమెరికా సరిహద్దుల వైపునకు వెళ్తున్న సమయంలో ఈ ఘటనలో 53మంది వలస కూలీలు మరణించారు. ఈ సంఘటన మెక్సికోలో జరిగింది. ట్రక్కులో పరిమితికి మించి బరువు ఉండటం, డ్రైవర్ వేగంగా ట్రక్క్ ని నడపడం వల్లే బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 54మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.