TV77తెలుగు ఇబ్రహీంపట్నం :
నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్న జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు....!!!
ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల లో పోషక విలువలు లేని ఆహారం అందిస్తున్నారు అంటూ పిల్లల తల్లి తండ్రుల పిర్యాదు...!!
పిర్యాదు చేయడానికి వెళ్లిన తల్లి తండ్రుల పై ఉపాధ్యాయులు కన్నెర్ర చేసిన వైనం....!!!
మీడియాకు తమ గోడు చెప్పుకున్న విద్యార్థుల తల్లి తండ్రులు....!!!
నిరుపేద కుటుంబాల పిల్లలు సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనే ఒక మంచి సంకల్పం తో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.అందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం అత్యంత ప్రధానమైన అంశం. చదువుకునే విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజనం అమలు చేస్తోంది.అయితే ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు.. గత నెల రోజులుగా సరైన ఆహారం అందించకపోవడం తో బాలికలకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆహారం సారిగా ఉండటం లేదని పిల్లలు చెప్పడం తో సదరు తల్లి తండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పిర్యాదు చేసెందు వెళ్ళారు.అయితే సరైన వివరణ ఇవ్వకపోగా తల్లి తండ్రులపై చిందులు తొక్కరట.అంతేకాకుండా మీకు నచ్చక పోతే పోయి వేరే స్కూల్ లో జాయిన్ అవ్వండి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారట. దీంతో బాలిక తల్లిదండ్రులు మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉపాధ్యాయులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగధంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై జిల్లా మండల స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకొని పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్,సత్య..మైలవరం