TV77తెలుగు మైలవరం
నామినేటెడ్ పదవుల కల్పన,, ప్రజా ప్రతినిధులు గా అవకాశం కల్పించడం లోనూ బీసీ లకే అగ్రతాంబూలం....!!!
గడిచిన రెండున్నర ఏళ్ల పాలన లో మైలవరం నియోజకవర్గ బీసీలకు జరిగిన సామాజిక నాయ్యం క్లుప్తంగా...!!!
నాడు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అంటే బిసిల పక్షపాతి అంటూ నియోజకవర్గం లో బీసీ సంఘాలు బహిరంగ సభల్లో ముక్త కంఠంతో నినదించాయి. కానీ ఇప్పుడు బిసి లను అణచివేస్తున్నారు అంటూ కుట్ర పూరిత ప్రచారం చేస్తుంటే అదే బిసి సంఘాలు మిన్నకుండి పోతున్నాయి. బిసి సంఘాలు నోరు మెదపకపోవడాన్ని అర్ధ అంగీకారంగా భావించవచ్చా.??? ఇదే విషయం పై పలువురు రాజకీయ ప్రముఖులను వివరణ కోరగా అలాంటిది ఏమి లేదని, అవన్నీ రాజకీయ కుట్ర లో భాగమని కొట్టిపడేస్తున్నారు.అసంతృప్తి అనేది అన్ని పార్టీల్లోనూ ఉంటుందని చెపుతున్నారు. ఒక నాయకుడు అందరికీ సమన్యాయం చేయాలని చూస్తారని ఎప్పుడైనా చిన్న పాటి లోటు పాట్లు జరిగినప్పుడు ఇలాంటి వివాదాలు తెరమీదకు వస్తాయని వారంటున్నారు.అయితే మైలవరం నియోజవర్గం లో జరుగుతున్న కుట్ర పూరిత ప్రచారం అర్థ రహితంగా తేల్చి చెబుతున్నారు. మైలవరం నియోజకవర్గం లో బిసిలకు అన్యాయం జరుగుతుందన్న వాదన సరైనది కాదని చెబుతున్నారు.అన్ని సామాజిక వర్గాల కంటే బిసిలు అగ్రభాగాన ఉన్నారని చెబుతున్నారు. అందుకు ఉదాహరణ. మైలవరానికి ప్రతిష్టాత్మకమైన మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఒక బిసికే దక్కిందని , అలానే గౌరవ ప్రదమైన దుర్గ గుడి పాలక మండలి డైరెక్టర్ పదవి సైతం ఎమ్మెల్యే వసంత బిసిలకు కేటాయించారు. అంతేకాకుండా మత్యకార, బట్రాజు, శాలివాహన రాష్ట్ర డైరెక్టర్ల పోస్టులు సైతం ఈ నియోజకవర్గ బిసిలకు కేటాయించారు. అలానే సహకార సంఘం పదవులు, ఎంపిపి లుగా,జడ్పీటిసి లుగా, సర్పంచ్ లుగా ప్రజా ప్రతినిధులు గా బిసిలకు అధిక ప్రాధాన్యత కల్పించారు.. అలానే పార్టీ పదవులు సైతం బిసిలకు కేటాయించారు. ఇది ఇలా ఉండగా బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా జ్యోతి బా పూలే విగ్రహావిష్కరణ అంతా తానే అయ్యి బిసిల ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ దే. ఇదే మాట వేలాది మంది పాల్గొన్న నిండు సభలో బిసిలు ముక్త కంఠంతో నినదించారు. కానీ ఇప్పుడు బిసిలను తక్కువ చేస్తూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం పై ఏ ఒక్క బిసి నేత స్పందించక పోవడాన్ని యావత్ మైలవరం నియోజకవర్గ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్న అంశం. రాజకీయ లబ్ది కోసం బిసిలను తక్కువ చేసి చూపించడం ఎంత వరకు కరెక్ట్ అనే వాదన ఇప్పుడు మళ్లీ తెర మీదకు వస్తోంది. అయితే ఇవన్నీ రాజకీయ వ్యూహాలలో భాగమని సరైన సమయం లో బిసిలు స్పందిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నోట్ .. నాడు బిసిల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోడం కోసం మహాత్మా జ్యోతి బా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన బిసి సోదరులపై లాఠీ ఝులిపించారు. విగ్రహం కావాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. కానీ వైసీపీ అధికారం లోకి వచ్చాక ఓకే ఒక్క మాట ఎమ్మెల్యే వసంత కు చెప్పిన బిసిలు వారి మాటకు అత్యంత గౌరవం ఇచ్చి కొండపల్లి కేంద్రంగా మహాత్ముడు జ్యోతి బా పూలే విగ్రహ ఆవిష్కరణ ఎమ్మెల్యే వసంత తన భుజాన వేసుకున్నారు.అంతేకాకుండా ఇబ్రహీంపట్నం లో కూడా కావాలని బిసిలు కోరడం తో ఇబ్రహీంపట్నం లో స్థల అన్వేషణ లో ఉన్నారు.ఇవన్నీ అమలు చేయడం వలనే కదా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బిసి పక్షపాతిగా చెరగని ముద్ర వేసుకున్నారు.
జరుగుతున్న విష ప్రచారం పై గణాంకాల ప్రకారం సునిశిత విశ్లేషణ
రిపోర్టర్,సత్య..మైలవరం