TV77 తెలుగు కొండపల్లి :
జనవరిలో సంపు సందడి....!!!
కొత్త సంవత్సరం లో "" తేజాస్ ఎలైట్ "" ఆధ్వర్యంలో వినూత్నంగా ""జుంబా"" డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహణ...!!!
హెల్త్ ఇస్ వెల్త్ నినాదం తో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న జుంభా డ్యాన్స్....!!
తేజాస్ ఎలైట్ అధినేత తాతినేని ప్రదీప్ చౌదరి నేతృత్వం లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం....!!
ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆహ్వానం...!!
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలను అధిగమించడమే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం తేజాస్ ఎలైట్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం లో ఫేమస్ అయిన జుంబా డ్యాన్స్ ను కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు పరిచయం చేయనున్నారు. పాశ్చాత్య దేశాల్లో విశేష ఆదరణ కలిగిన జుంబా డ్యాన్స్ ఆరోగ్య పరంగా కూడా మేలు చేస్తుంది అనేది నిర్వాహకుల మాట. కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు ఆరోగ్యం తో పాటు వినోదాన్ని పంచడం కోసం తాము ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తేజాస్ ఎలైట్ అధినేత తాతినేని ప్రదీప్ చౌదరి తెలిపారు. జనవరి 2 ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు జరిగే ఈ డ్యాన్స్ ప్రోగ్రాం లో హీరో సంపూర్ణేష్ బాబు సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రిపోర్టర్,సత్య..మైలవరం