ఆలయానికి సమీపంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నాo


TV77తెలుగు   శ్రీశైలం క్రైమ్ :

 శ్రీశైలంలో ప్రధాన ఆలయానికి సమీపంలో ఓ యువతి పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం  108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి హైదరాబాద్‌కు చెందిన మౌనికగా(25) గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు  కారణాలు తెలియాల్సి ఉంది.