TV77 తెలుగు రాజమండ్రి :
మౌలిక సదుపాయాలు, కనీస వసతులు కావాలి.
చట్ట బద్దమైన పాలన అమలు జరగాలి.
మానవ హక్కులకు రక్షణ కావాలి.
కార్పొరేట్ మీడియా లో మార్పు రావాలి.
మేడా శ్రీనివాస్, ఆవేదన, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ కు అత్యవసర ఎమర్జెన్సీ తప్పదా ! అంటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహం వెలి బుచ్చారు. ఏపిలో ప్రజా ప్రతినిధులు లేరని,ఏపి శాసనసభ ప్రజా సమస్యలకన్నా బూతు, రంకు పురాణాలకు వేదికగా మారిందని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వారే నేడు శాసనసభ్యులుగా చలామణి అవుతున్నారని, నేటి ఎమ్మెల్యే ల్లో ఏ ఒక్కరు గెలిపించిన ప్రజల సమస్యల పట్ల గాని, నియోజకవర్గ అభివృద్ధి పట్ల గాని, నియోజకవర్గ పాలన పట్ల గాని ఏ మాత్రం దృష్టి కేంద్రీకరించటం లేదని, కొంతమంది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఏపి రాజధాని ప్రాంత గెస్ట్ హౌస్ ల్లోను, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు క్లబ్స్ ల్లోను ఖరీదైన చతుర్ముఖ పారాయణం ఆడుకుంటున్నారని, కొంతమంది ఫోన్లలో మహిళలతో అరగంట, గంట అంటు విశ్రాంతి రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని,ఒకనాటి విలువలు గల ప్రజా ప్రతినిధులు నేడు ఆంధ్రప్రదేశ్ లో కరువైయ్యారని, మోయలేని పేదరికం కారణంగా ఓటర్లలో నాణ్యతా పరిమాణం లోపించటమే నేటి ప్రజా ప్రతినిధులుకు వరంగా మారిందని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ప్రమాద కర స్థితిలో వుందని, బలహీనతలకు తావు లేకుండా కేంద్రం ఏపి కి మంచి చేయాలి అనుకుంటే ఏ క్షణాన్నైనా రాష్ట్రం లో అత్యవసర ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులు వున్నాయని, ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవటానికి 13 జిల్లాల్లో గల మానవతా వాదులు, సంఘ సంస్కర్తలు, విద్యార్థులు ఎలాంటి వేధింపులనైనా తట్టుకోవటానికి సిద్దపడి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, ఏపి శాసనసభ మలినం కాకుండా కాపాడుకోవాలని ఆయన కోరారు. ఏపిలో ఏ ఒక్క సగటు మనిషి కనీస వసతులకు, మౌలిక సదుపాయాలుకు నోచుకోవటం లేదని, ఉపాధి మార్గాలు లేని ఏపిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాలకులకు అధికారం పై వున్న ధ్యాస ప్రజా సమస్యలపై లేకపోవటమే అందుకు ప్రధాన కారణం అని, నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో అర్జీలకు, అనుమతులకు విలువల్లేవని, కేవలం అడిగిన లంచం ఇవ్వగలిగితే చాలు ఎలాంటి దోపిడి కైనా అనుమతులు లభిస్తాయని, ప్రస్తుతం వున్న చట్టాలతో పోరాడే శక్తి ప్రజల్లో లేదని, కాలయాపన తీర్పులతో తరాలు అంతరించి పోయినా తీర్పులు వెలువడటం లేదని, నేడు చట్టం రక్షిస్తుందనో, న్యాయం కాపాడుతుందనో, ప్రభుత్వం భద్రత కల్పిస్తుందనో నేటి ప్రజలు విశ్వాసం కోల్పోయి సంఘ విద్రోహులను ఆశ్రయిస్తు అనేక సమస్యల్లో ఇరుక్కుంటున్నారని ఆయన ఆవేదన చెందారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించని వాళ్ళే నేడు చట్ట సభలకు ఎన్నికై తున్నారని, రూల్ ఆఫ్ లా కు అర్ధం తెలియని వాళ్లు స్పీకర్లగా చలామణి అవుతున్నారని, ఏ పార్టి అధికారంలో వున్నా స్పీకర్ వైఖరి చట్ట నిబంధనలకు భిన్నంగానే వుంటుందని, ప్రజా ప్రతినిధులు వైఫల్యాలకు ప్రధానంగా ఎన్నికల సంఘం ఉదాసీనత కుడా ఒక కారణంగా భావించాలని, ధనం తో శాసించే ప్రధాన రాజకీయ పార్టీలను రెండు కళ్ళతో చూస్తు, పేద ప్రజల పార్టీలను ఒంటి కన్నుతో చూడటం అతి పెద్ద పొరపాటుగా భావించాలని, ఎన్నికల సంఘం కళ్ళముందే ఓటర్లకు మాకు ఓటు వేయండి టివిలు ఇస్తాం, డబ్బు ఇస్తాం, ఉచిత పథకాలు ఇస్తాం, మీకు రుణాలు మాఫీ చేస్తాం అని బాహాటంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా, డబ్బు పంచుతున్నా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తు అభ్యుదయ భావాలతో ఎన్నికల బరిలో నిలబడ్డ వారికి ఎన్నికల అనంతరం నిబంధనలు ఉల్లంఘించారు అని అక్కరకు లేని నోటీసులు జారి చేసి వేధింపులకు గురిచేస్తుంటారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.
ప్రజా ప్రతినిధులు అక్రమాలను, వారు చేసిన ప్రమాణాలను
సగటు సామాన్య పౌరుడు గుర్తు చేసినా, ప్రశ్నించినా, పిర్యాదు చేసినా అధికార మదంతో తీవ్రమైన వేధింపులకు గురిచేరుస్తుంటారని, కొన్ని పరిస్థితుల్లో కొంతమంది అవినీతి అధికారులుతో అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారని , ఒకప్పుడు నాయకుని వెంట ప్రజలు ఉండేవారని, నేడు గుండాలు, నేరస్తులు నేతలకు అండగా నిలుస్తు ప్రజలను భయబ్రాన్తులకు గురిచేస్తున్నారని, మానవ హక్కులకు భద్రత లేకుండా పోయిందని, ప్రస్తుతం మానవ హక్కుల సంఘాల పనితీరు పిర్యాదులకే పరిమితం అయితుందని, సరైన తీర్పులు జారి చేయలేక పోతుందనే విమర్శలు ప్రజల్లో బలంగా వున్నాయని, మానవ హక్కుల సంఘాలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తు చట్ట సవరణ జరపాలని, ప్రస్తుతం వున్న అధికారాలు అక్రమార్కులను శిక్షించ లేకపోతున్నాయని, పూర్తి అధికారాలు కల్పిస్తు ప్రతి జిల్లా కేంద్రం లో ఒక మానవ హక్కుల సంఘం కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల సర్వేల పేరుతొ కార్పోరేట్ మీడియా వాస్తవ విధులు పై దృష్టి సారించటం లేదని, సెలబ్రిటీ ల పేరుతొ స్వప్రయోజనాలకు దారి చేసుకుంటున్న వారికి, హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఇంకా ఖరిదైన విల్లాల్లో నివసిస్తున్న వారికి, అమరావతి లో ప్రధాన రాజకీయ పార్టీల వారికి మాత్రమే అధిక ప్రాధాన్యతనిస్తు వాస్తవ సంఘటనలును వెలుగు చూడనీయటం లేదని, ఎప్పుడు రాష్ట్రాన్ని దోచుకు తింటున్న వారికి, ఏటా ఒక రాజకీయ పార్టి మారి సొల్లు ఉపన్యాసాలు గుప్పించే వారికి, కిరాయి ప్రచారం చేయించుకునే కిరాయి ప్రజా ప్రతినిధులుకు కార్పోరేట్ మీడియా యాజమాన్యం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తు రోజుల్లో రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులుగా కార్పోరేట్ మీడియా తీర్చి దిద్దుతుందని, అన్యాయం ఐయి పోతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం, ప్రత్యేక హోదా, విభజన హామీల వాగ్దానం కోసం, మాసానికో మాట, చొక్క మార్చి నట్టు పార్టి మార్చే వారికి,బ్యాంకులకు ఆర్దికంగా కుచ్చు టోపీ పెట్టిన వారికి నేటి కార్పోరేట్ మీడియా ప్రాధాన్యత నిస్తు సామాజిక అభివృద్ధి కి అడ్డుగా నిలుస్తున్నారని, క్వాలిటీ జర్నలిజం అంతరించి పోవటానికి నేటి కార్పొరేట్ మీడియా ప్రధాన కారణంగా నిలుస్తుందని, గ్రామాల దుర్భర పరిస్థితులను, గ్రామస్థాయిలో వున్న యువ నేతలను ప్రోత్సహించకుండా ప్రభుత్వ వేధింపులను బహిర్గతం కాకుండా కొమ్ము కాస్తుందని, కొన్ని కార్పొరేట్ మీడియా యాజమాన్యం వారి సొంత కులాలను మాత్రమే భుజాన మోస్తు స్వచ్ఛమైన ప్రజా పోరాట ఉద్యమ కారులను ఎదగనీయకుండా సమాంతర శక్తిగా శాసిస్తున్నారని, ఈ తరహా మీడియా యాజమాన్యం లో మార్పు రాకపోతే రాబోవు రోజుల్లో ఇలాంటి మీడియా వ్యవస్థలు కనుమరుగయ్యే ప్రమాదం వుందని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు.
సభకు ఆర్పిసి సీనియర్ నగర సెక్యులర్ దుడ్డె త్రినాధ్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ రమణమూర్తి, లంక దుర్గా ప్రసాద్, ఎండి హుస్సేన్దు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్కొ, కొల్లి సిమ్మన్న, వానపల్లి జ్యోతిష్, వల్లి శ్రీనివాసరావు, కోమర్తి గోపి శ్రీనివాసరావు, పిల్లాడి ఆంజనేయులు,ముప్పన రమేష్ , పి. ప్రసాద్ , కే వి రవి కుమార్, మాసా అప్పాయమ్మ, నాగూరి అన్నపూర్ణ తదితరులు పాల్గొని యున్నారు.
మేడా శ్రీనివాస్, MA, LLM, MA(Jour)
అధ్యక్షులు,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్