TV77తెలుగు కొండపల్లి :
ఇబ్రహీంపట్నం లో పడబోయిన వైసీపీ జెండాను నిలబెట్టిన ""ఆర్ ఆర్""..!!!
ఆ ముగ్గురు గెలుపుతో టిడిపి ఆశలకు గండి....!!
పడగొడదామని చూసినా పట్టు విడవని ఇబ్రహీంపట్నం 14,19,23, డివిజన్ల వైసీపీ అభ్యర్థులు....!!!
కొండపల్లి మున్సిపాలిటీ ఉత్కంఠ భరిత ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన పుర పోరులో టిడిపి అనూహ్యంగా పుంజుకుంది.అయితే కొండపల్లి వైసీపీ అభ్యర్థులకు పోటీ ఇవ్వలేని తెలుగు తమ్ముళ్లు అక్కడ ఢీలా పడినప్పటికీ ఇబ్రహీంపట్నం లో హవా కొనసాగించారు.అయితే దాదాపుగా 14 కి 11 సీట్లు ఆధిక్యం సాధించిన టిడిపి ఆ మూడు వార్డుల్లో ప్రభావం చూపలేక పోయారు.ఇబ్రహీంపట్నం 14 వ వార్డులో పోటీ చేసిన నల్లమోతు లక్ష్మి భారీ మెజారిటీ తో గెలుపొంది వైసీపీ కీర్తి పతాకాన్ని శిఖరాగ్రాన నిలబెట్టారు. ఇక 19, 23 వార్డుల్లో పోటీ చేసిన డబల్ ఆర్ జోగి రాము, షేక్ రసూల్ అనూహ్యంగా మెజారిటీ సాధించి విజయఢంకా బాజాయించారు.14 వ డివిజన్ లో నల్లమోతు రవికి మంచి సానుకూల వాతావరణం ఉండగా, 23, 19 వార్డులో టిడిపి గట్టి పోటీనే ఇచ్చింది. అయితే ఈ రెండు వార్డుల్లో పోటీ చేసిన జోగి రాము, షేక్ రసూల్ అపారమైన రాజకీయ అనుభవం కలిగిన నేతలు కావడం తో ఇబ్రహీంపట్నం లో పడబోయిన వైసీపీ జెండాను నిలబెట్టారు. ఈ రెండు వార్డుల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించాలని తెలుగు తమ్ముళ్లు ఎన్ని ఎత్తులు వేసిన వాటిని చిత్తు చేసి వైసీపీ అభ్యర్థులు వాటిని తిప్పి కొట్టి విజయ అవకాశాలను పదిలం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం లో ఈ మూడు వార్ధులు వైసీపీ కైవసం చేసుకోకుంటే పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఏది ఏమైనా భవిష్యత్ లో ఈ ముగ్గురు నేతల ప్రభావం మరింత భాగా పని చేస్తుంది అని ఇబ్రహీంపట్నం వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.
రిపోర్టర్,సత్య...మైలవరం