TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
19వ డివిజన్ ప్రచార బాధ్యతలు చేపట్టిన ఇబ్రహీంపట్నం ఆడపడుచులు....!!
19 వ డివిజన్ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్ధి జోగి రాము విజయానికి పునాదులు వేస్తున్న ఎమ్మెల్యే జోగి రమేష్ సతీమణి శకుంతల దేవి...!!
జోగి రాము ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి....!!!
ఇబ్రహీంపట్నం ఆడపడుచు లకు హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు..!!
ప్రతిష్టాత్మక కొండపల్లి పుర పాలక పోరులో వైసీపీ అభ్యర్థులు ప్రచార పర్వం లో దూకుడు పెంచారు. గెలుపే లక్ష్యంగా చేసుకుని ప్రజా క్షేత్రంలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక ఇబ్రహీంపట్నం 19 వ డివిజన్ లో పోటీ చేస్తున్న జోగి రాము విజయానికి ఇబ్రహీంపట్నం ఆడపడుచులు పూల బాటలు వేస్తున్నారు. జోగి రాము విజయాన్ని కాంక్షిస్తూ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సతీమణి శకుంతలా దేవి ప్రచార బాధ్యతలు స్వీకరించారు.నిన్న జరిగిన ప్రచార కార్యక్రమం లో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి తో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అభివృద్ధి కి ఓటు వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. నిత్యం అందుబాటులో ఉండే జోగి రాము కి అఖండ మెజారిటీ కట్టబెట్టాలని కోరారు.
రిపోర్టర్,సత్య.. మైలవరం