TV77తెలుగు కొండపల్లి :
హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైసీపీ నియంతృత్వ దోరణి....!!!
ఎక్సఫిషియ ఓటు వేయడానికి వచ్చిన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వని అధికారులు....!!
టిడిపికి 16 సభ్యుల బలం ఉన్నప్పటికీ పాలకవర్గం
ఏర్పాటుకు సహకరించని అధికారులు....!!!
మీడియాతో ఎంపి కేశినేని నాని వాఖ్యలు..
కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పాటుపై అయోమయం కొనసాగుతుంది. అయితే గెలిచిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం రసాబాసగా జరిగింది. ఇరు పార్టీల సంఖ్యా బలంలో స్పష్టమైన సంకేతాలు లేకపోవడం కారణంగా ఎవరు పాలకవర్గం ఏర్పాటు చేస్తారు అనే అంశం పై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకారం ఉద్రిక్త వాతావరణం నడుమ వాయిదా పడింది. దీంతో టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాయిదా పై లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఎంపి కేశినేని నాని పట్టుబట్టారు. ఉదయం నుండి జరుగుతున్న హైడ్రామా సాయంత్రానికి ముదిరి పాకాన పడింది. లిఖిత పూర్వకంగా ఇవ్వకపోతే కార్యాలయం విడిచి వెళ్ళేది లేదని ఎంపి కేశినేని నాని భీష్మించుకుని కూర్చున్నారు.అయితే సాయత్రం బయటకి వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు.. పాలక వర్గం ఏర్పాటు చేయడానికి వైసిపికి సంఖ్యా బలం లేదని అది జీర్ణించుకోలేకనే కార్యాలయంలో వైసీపీ కౌన్సిలర్లు వీరంగం సృష్టించారు అని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం హై కోర్టు ఆదేశాలు సైతం భేఖాతరు చేస్తూ అధికారులు నియంతృత్వ పోకడ అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం వాయిదా పై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. 16 మంది సభ్యుల సంఖ్యా బలం తో తాము పాలక వర్గం ఏర్పాటు చేయడం కోసం సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
రిపోర్టర్,సత్య..మైలవరం