మినీ ఐచర్ లారీ బోల్తా ఇద్దరు మృతి


  TV77తెలుగు  అనంతపురం :

 తాడిపత్రి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మణపల్లెకు కూలీలతో పత్తి తీయడానికి వెళ్తున్న మినీ ఐచర్ లారీ చుక్కలూరు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.