TV77తెలుగు కొండపల్లి:
10 ఏళ్లుగా చారిత్రక కొండపల్లి ని పాలకులు, మంత్రి హోదాలో ఉన్నవారు విస్మరించారు...!!
ఒక ఎమ్మెల్యే గా కొండపల్లి సర్వతోముఖాభివృద్దికి శక్తి వంచన లేకుండా పనిచేశాను...!!
అభివృద్ధి చేసి చూపించి ఓట్లు అడుగుతున్నాం..అసలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు..??
విజ్ఞత తో ఆలోచన చేయండి.. సమర్థులకు పట్టం కట్టండి..!!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ ముగింపు సందర్భంగా ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్....!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ ముగింపు దశకు చేరుకోవడంతో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రజలకు పలు విజ్ఞప్తులు చేశారు. కొండపల్లి ఇబ్రహీంపట్నం జంట గ్రామాలను మున్సిపాలిటీగా మార్చిన నాటి నుండి అభివృద్ధి లో ఎక్కడ రాజీ పడలేదని తెలిపారు. నాడు మంత్రి హోదాలో ఉండి కూడా చేయలేని ఎన్నో అభివృద్ధి పనులను చేసి చూపించామని గుర్తుచేశారు.కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కి కట్టుబడి పనిచేస్తామని ఎవరు సమర్థులు, ఎవరు అసమర్ధులు బేరీజు వేసుకొని మీ అమూల్యమైన ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్, సత్య. మైలవరం