TV77తెలుగు ఇబ్రహీంపట్నం :
వ్యాపార సామ్రాజ్య విస్తరణ లో భాగంగా ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్న ఆల్ఫా నిర్వాహకులు...!!!
హోటల్ ఎదుట భారీగా వాహనాల నిలిపివేత, ట్రాఫిక్ కు అంతరాయం...!!!
పోలీసుల జోక్యంతో అదుపులోకి వచ్చిన ట్రాఫిక్ నియంత్రణ....!!
నిభందనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ మేనేజ్మెంట్ కు హెచ్చరికలు జారీ చేసిన ఎస్ఐ మణి..!!
కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం. ట్రాఫిక్ నియంత్రణకు విఘాతం కలిగిస్తున్న ఆల్ఫా హోటల్ యాజమాన్యం పై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యాపార సామ్రాజ్య విస్తరణ లో భాగంగా ఆల్ఫా యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదారి బ్లాక్ చేసి ఇబ్బడి ముబ్బడిగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో సర్వీస్ రోడ్డు పూర్తిగా మూసుకుపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఆల్ఫా యాజమాన్యం మద్య స్వల్ప మాటల యుద్ధం జరిగింది. ఇక. ఇదే విషయం లో పోలీసులు జోక్యం చేసుకొని వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకున్నారు. వాహనాలు మొత్తం క్లియర్ చేసి ట్రాఫిక్ అదుపులోకి తీసుకొచ్చారు.అనంతరం ఆల్ఫా యాజమాన్యం తో ఇబ్రహీంపట్నం మహిళా ఎస్ఐ మణి మాట్లాడుతూ ట్రాఫిక్ కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిభందనలకు అనుగుణంగా నడుచుకోవాలని లేని పక్షం లో శాఖ పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
రిపోర్టర్ సత్య.మైలవరం