తండ్రి బాటలోనే తనయుడు


 TV77తెలుగు కొండపల్లి :

తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ప్రజాసేవ కాంక్షతో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర...!!

యువజన విభాగం నాయకుడుగా, జనసేన క్రియాశీల నేతగా నిర్విరామ ప్రజా సేవ...!!!

ప్రజా క్షేత్రం లో తన బలాన్ని రుజువు చేసుకునేందుకు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచిన అడపా శివ....!!!

" అడపా శివ " కొండపల్లి మాజీ ఉప సర్పంచ్ అడపా నరసింహా రావు తనయుడు.మచ్చ లేని రాజకీయ నాయకుడుగా, నిస్వార్థ ప్రజా సేవకుడిగా  ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న అడపా నరసింహ రావు  సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన శైలిలో పనిచేశారు. ఇప్పుడు ఆయన బాటలోనే తనయుడు "అడపా శివ " తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.. కొండపల్లి ప్రజలకు సుపరిచితుడు గా, ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. యువజన విభాగం నాయకులు గా, జనసేన క్రియాశీల నేతగా, జర్నలిస్టుగా విలువైన సేవలు అందిస్తున్నారు. అయితే కొండపల్లి ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని ఇక బలమైన విశ్వాసం తో ప్రత్యక్ష రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించూకోవడానికి  కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రజా సేవ చేయడానికి ఒక అవకాశం ఇస్తానని నమ్మకం తో కొండపల్లి మున్సిపాలిటీ 6వ డివిజన్ జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించాలని అడపా శివ 6వ డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.          రిపోర్టర్,సత్య. మైలవరం