రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రష్టు పట్టింది సీడబ్ల్యూసీ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ చింతామోహన్


TV77 తెలుగు  రాజమండ్రి :

దేశం లో ఆర్ధిక అసమానతలు పెరిగిపోతున్నాయిని, దేశంలో ఆకలి కేకలు ఎక్కువ కనిపిస్తున్నాయని, ధరలు అధికంగా పెరిగిపోయిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు ,మాజీ ఎంపి, డాక్టర్ చింతామోహన్ విమర్శించారు. స్థానికంగా ఆనం రోటరీ హాల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే 8వేల కోట్ల రూపాయలతో  ప్రధాని విమానం  కొన్నారని, దేశంలో జరిగిన అభివృద్ధి అంతటిని అమ్మకానికి పెడుతున్నారని  విమర్శించారు. రాష్ట్రం లోను  పరిస్థితిలు అద్వనంగా ఉన్నాయిని, కుప్పంలో   దొంగ ఓట్లు ఎక్కువ పడ్డ యని ప్రజాస్వామ్యం  బ్రష్టు పట్టిన అన్నారు. ఎస్టీ,ఎస్సి మైనారిటీ,ఓబీసీ విద్యార్థులు దాదాపు  80 లక్షలకు మందికి రావలసిన స్కాలర్ షిప్ లు ,మెస్ చార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ లు వెంటనే రాష్ట్ర ప్రబుత్వం చెల్లించాలన్నారు, 20 24 లో రాష్ట్రంలో కాపు ముఖ్యమంత్రి రావాలి.రాష్ట్రం లో కోటి మంది కాపులు ఉన్నారని, రాబోయే రోజుల్లో కాపు వర్గం నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి రావాలన్నారు. వారిలో చైతన్యం అవసరమన్నారు.