గెలుపు గుర్రాల సవారీ షురూ...!!


 

TV77తెలుగు కొండపల్లి :

వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం పర్వం భాద్యతలు తీసుకున్న మహిళా ప్రజా ప్రతినిధులు....!!!

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వనితా నేతలు...!!!

ఇప్పుడు వారి చరిష్మతో మహిళా ఓటు బ్యాంక్ పదిలం చేసుకునే దిశగా అడుగులు..!!

గెలుపు ధీమాతో ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థులు....!!!

వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న జడ్పీ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి,  ఎంపిపి పాలడుగు జ్యోత్స్న.....!!!

ప్రతిష్టాత్మక పుర పోరులో  వైసీపీ గెలుపు అస్త్రాలను సిద్ధం చేసింది.ప్రజా పాలనతో అనతి కాలంలోనే ప్రజలకు చేరువ అయిన మహిళా ప్రజా ప్రతినిధులను కథనరంగం లోకి దింపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో  రికార్డ్ మెజారిటీ సాధించి మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రచార భాద్యతలు అప్పగించి ఆ రెండు గెలుపు బాణాలను ప్రజా క్షేత్రంలో ఎగ్గుపెట్టింది. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార భాద్యతలు తీసుకున్న జెడ్పీ ఛైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి, ఎంపిపి పాలడుగు జ్యోత్స్న ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్దులు దాదాపుగా ఖరారు కావడం తో అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను అభర్ధిస్తున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే వైసీపీ గెలవాలి అంటూ ప్రజలకు వివరిస్తున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కట్టుబడి ఉన్నారని ఇప్పటివరకు చేసిన అభివృద్ధి చూసి ఓట్లు వేయాలని కోరుతున్నారు.

రిపోర్టర్,సత్య..మైలవరం