పర్యాటక జల విహార యాత్ర పున ప్రారంభం


 TV77తెలుగు రాజమహేంద్రవరం:

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ప్రాజెక్టు చుట్టుప్రక్కల మంచిగా పర్యాటకరంగ అభివృద్ధి చర్యలు చేపట్టి దేశ ,విదేశీయ పర్యాటకులను సహితం ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం గండిపోసమ్మ వద్ద పాపికొండ పర్యాటక జల విహార యాత్రను ఆయన పున: ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో మంచి వాతావరణం సుమారు 2సంవత్సరాలు అనంతరం మరలా యాత్రను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. 2019 లో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదాన్ని దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 5 గురు అభిల భారత సర్వీసుల అధికారులుతో ప్రామాణిక ఆపరేషన్ మరియు పర్యాటకులు భద్రత, రక్షణ అంశాలపై విధివిదానాలు అత్యంత పక్కాగా రూపొందించారని వాటికి అనుగుణంగానే యాత్రను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి నాలుగు శాఖల అధికారులను బృందాలుగా నియమించడం జరిగిందని కంట్రోల్ రూమ్లో రెవిన్యూ పోలీసు, టూరిజం జలవనరు శాఖ అధికారులు బోట్లలోరక్షణ, కదిలికలకు సంబందించి చెకప్లు నిర్వహించి అనుమతులు ఇస్తారని ,గతంలో కంటే భిన్నంగా ఎస్కార్డు బోటు ంటుందని, ఈబోటులో గజ ఈతగాళ్లు, జి.పి.ఎస్ కోర్డినేట్స్ సౌలభ్యం, కమ్యూనికేషన్ కొరకు శాటిలైట్ పోన్ అందుబాటులో వుంటాయన్నారు. అనుమతులు పొందిన బోట్లలో లైస్సెన్లు డ్రైవర్లు, సరంగులు ఉంటారన్నారు.అన్నిరకాలుగా భద్రత ప్రమాణాలతో బోటు జల విహార యాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు నది వరదజలాల ప్రవాహాలు, రక్షణ వ్యవస్థలు మీద పూర్తిగా దృష్టి సారించడం జరుగుతుందన్నారు వ్యక్తిగత రక్షణ పరంగా పర్యాటకులు ముందుగా బోట్లు ఎక్కగానే లైవ్ జాకెట్ ధరించాలని సూచించారు. బోట్లలో మద్యాన్ని నిషేధించడం జరిగిందన్నారు. టిక్కెట్ల దరలను ఆన్ లైన్ లో పిక్సిడ్గా నిర్దేశించడం జరిగిందని ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన పనిలేదన్నారు. అల్పాహారం, మధ్యాహ్నా బోజనం, బిస్కెట్లు అందించడం జరుగుతుందన్నారు. ఉదయం గండిపోశమ్మ గుడివద్ద బోట్లు బయలుదేరి పేరంటాలపల్లి వెళ్లి సాయంత్రానికి మరలా చేరుకుంటాయని రాజమహేంద్రవరం నుంచి గండిపోశమ్మగుడి వద్దకు మిని వాహనాలలో పర్యాటకులను తీసుకొని వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రకృతి ఒడిలో పర్యాటకులు మదిలో కదలాడే యాత్ర పాపికొండలు పేరంటాలపల్లి యాత్రని, ఇక్కడి బోటు ప్రయాణం.ఎంతో ఆహ్లాదకరమని, గోదావరి నడి పొడవునా గిరిజన పల్లెలు, సోయగాలు, పాపికొండలు పర్యాటకంలో తారసపడతాయన్నారు. ఈ జల విహార యాత్ర ప్రత్యేక అనుభూతిని కల్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎన్ ధనలక్ష్మీ, జాయింట్ కలెక్టరు ఎ భార్గవ్ తేజ. టూరిజం ఇడి మాల్ రెడ్డి, ఎపి పర్యాట అభివృద్ద సంస్థ చూర్మన్ వరప్రసాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.