TV77తెలుగు రాజమహేంద్రవరం :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలోచన విధానం అనుసరణీయమని షెడ్యూల్డ్ కేస్ట్ రైట్స్ ప్రొటక్షన్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ అన్నారు.భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనా విధానం వలన ఈనాడు బడుగు,బలహీన వర్గాల వారు ఉన్నత స్థితిలో ఉన్నారని,ఆయన కృషి వలనే సమాజంలో సమానత్వం ఏర్పడిందన్నారు.నాడు బలహీన వర్గాల పట్ల అగ్రవర్ణాలు చూపే అస్పృశ్యతను పారద్రోలారని కొనియాడారు.ఆయన రచించిన రాజ్యాంగం స్వేచ్చకు,సమానత్వానికి,సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. వారి కృషిని నిత్యం స్మరించ బద్దులమై ఉన్నామని,వారి ఆలోచనా విధానాన్ని నేటి తరానికి తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కవులూరి వెంకటరావు, కొమర్తి బాబ్జి, గొల్ల దినేష్ కుమార్, పీతల సతీష్ కుమార్, కాశి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.