TV77తెలుగు దూబచర్ల క్రైమ్:
పశ్చిమగోదావరి జిల్లా మండలం దూబచర్లలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. దూబచర్లకు చెందిన ప్రవీణ్ కుమార్, ఆరేపల్లి సత్యవతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఏడాది క్రితమే తమ ప్రేమను పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు వీరి సంపారం సజావుగానే సాగింది. అయితే ఉన్నట్లుండి తన భర్త ముఖం చాటేశాడని బాధితురాలు వాపోయింది. తన భర్త తనకు కావాలని గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సత్యవతి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో మంగళవారం అత్తింటి ముందు ఆందోళనకు దిగినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అత్తామామాలు ఆమెను కొట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారని సత్యవతి ఆరోపించారు. అయితే తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదలబోనని సత్యవతి అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.