ఆ వార్డుల్లో వైసీపీ వార్ వన్ సైడ్....!!!!

 

TV77తెలుగు  కొండపల్లి:

ప్రజాధరణ జోష్ లో 23, 24,14 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు...!!!

వైసీపీ అభ్యర్థుల గెలుపుకు ఒక్కతాటి మీదకు వచ్చిన ఎస్సీ నాయకులు....!!!

ఎమ్మెల్యే వసంత ఆదేశాలతో వైసీపీ అభ్యర్థుల విజయానికి బాటలు...!!! 

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం కోండత బలంగా మారింది. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు దాదాపుగా ఖరారు కావడం తో 23, 24, 14 వార్డుల్లో విజయ ఢంకా మోగించడం ఖాయమని వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం వైసీపీ ఎస్సీ నేతలు అందరూ ఒక్కతాటి మీదకు వచ్చి అభ్యర్థి గెలుపుకు శక్తి వంచన లేని కృషి చేస్తున్నారు. వైసీపీ నేతలు కృషి ఫలితం, ఎమ్మెల్యే వసంత ఎస్సీలకు ఇస్తున్న ప్రాధానత్య అభ్యర్థుల గెలుపుకు బాటలు వేస్తుందని వైసీపీ కేడర్ భావిస్తోంది.అంతేకాకుండా ప్రచారం పర్వం లో ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి ఆ వార్డుల్లో అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లు సాగుతోంది.

రిపోర్టర్ , సత్య.. మైలవరం