TV77తెలుగు కొయ్యలగూడెం :
ఇళ్ల మధ్యలో పందులుముడుపుల మత్తులో పరింపూడి పంచాయతీ
కొయ్యలగూడెం గ్రామంలో ఇళ్ల మధ్యలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్న ఎన్నోసార్లు ప్రజలు పంచాయతీకి ఆఫీసు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు అంతే కాకుండా పందుల పెంపకం దారుల దగ్గర ముడుపులు తీసుకుని పందులు ఊరిలో తిరగడానికి పర్మిషన్ కూడా ఇచ్చేశారు డెంగ్యూ, మలేరియా వ్యాధులు లతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అసలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు దేవుడు మాన్యం, గవర్నమెంట్ కాలేజ్ ఏరియాలో పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్న ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టిన పట్టించుకోకుండా ఇళ్ల మధ్యలోకి వదిలేస్తున్నారని దేవుడు మన్యం ప్రజలు పేర్కొన్నారు దీనికి పరిష్కారం దొరకకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ప్రజలు తెలిపారు.
రిపోర్టర్, పృథ్వీ గౌడ్. కొయ్యలగూడెం