నడిరోడ్డు పై చాప వేసుకుని పడుకుని నిరసన తెలిపిన యమ్.ఎల్.ఎ గోరంట్ల


 TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్:

రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో బుధవారం రూరల్ శాసనసభ్యులు  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆద్వర్యంలో కాతేరు గామన్ బ్రిడ్జ్ వద్ద పూర్తిగా గుంతలు పడి‌ ప్రయాణికులు నడవలేని స్థితిలో రోడ్లు శిధిలావస్థలో రోడ్లు ఉన్నాయి, వినూత్న రీతిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి రోడ్డు పై తాటాకు చాపలు వేసుకుని డాక్టర్‌ తో వైద్యం చేయించుకున్నారు.జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు  ప్రయాణం చేస్తే వారితో పాటు డాక్టర్ ను కూడా వెంట తీసుకు వెళ్లాలని ఎక్కడ ప్రమాదం జరిగితే డాక్టర్ అక్కడే నడి రోడ్డు పైన వైద్యం చెసే విధంగా ఉందని.రాష్టాన్ని దివాలా దిశగా నడుపుతున్నారని రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్లకు పడిన గుంతలను పూడ్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటే సిగ్గు పడాలని అన్నారు. లిక్కర్ మాఫియా,గంజాయి మాఫియా,డ్రగ్స్ మాఫియా,ఇసుక మాఫియా,ఎర్ర చందనం మాఫియా,గ్రావెల్ మాఫియా,మైనింగ్ మాఫియలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గంగిన హనుమంతరావు.,మత్సేటి ప్రసాద్,నున్న కృష్ణ,బిక్కిన సాంబ,కురుకూరి కిషోర్,వర్రే రాజెష్,మన్యం పెద్దబాబు,తలారి భగవాన్,కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.