మంగళగిరి లో కారు ఢీ వ్యక్తి మృతి


 TV77తెలుగు మంగళగిరి  క్రైమ్ :

మంగళగిరి జాతీయ రహదారి లోని హ్యాపీ క్లబ్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పై జరిగిన ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు ఢీ కొట్టింది. దీంతో వ్యక్తి ప్రమాద స్థలిలోనే మృతిచెందారు. మృతదేహం కారు కింద భాగంలో చిక్కుకుపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.