వారు పెద్ద పీట వేస్తే...!!


 TV77తెలుగు కొండపల్లి :

వీరు నేల సీటుకు పరిమితం చేశారా...??

కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా మెజారిటీ ఓటింగ్ ఉన్న వడ్డెరలకు పెద్ద పీట వేసిన వైసీపీ...!!!

చైర్మన్ అభ్యర్థి గా గుంజా శ్రీనివాస్ ను ప్రతిపాదించిన వైసీపీ....!!

సీట్ల కేటాయింపులో కూడా వడ్డెరలకు ప్రాధాన్యత ఇవ్వని టిడిపి....!!!

తాజాగా పాలకవర్గ కొలువులలో కూడా వడ్డెరలకు దక్కని చోటు...!!

సోషల్ మీడియా వేదికగా టిడిపి అధినాయకత్వం నిరంకుశ వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్న కుల సంఘాల నేతలు...!!

కొండపల్లి మున్సిపాలిటీ పాలక వర్గ ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంచనాలు మొత్తం తారు మారు చేసిన ఈ ఎన్నికలు అధికార పార్టీనీ గట్టి దెబ్బ తీసిందని చెప్పాలి.అయితే నాటకీయ పరిణామాల నడుమ జరిగిన పాలకవర్గ ఎన్నిక ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో ఒక కొలిక్కి వచ్చింది.ఈ నేపథ్యంలో ఇరు పార్టీల వారు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రచారం లో లేని గుంజ శ్రీనివాస్ ను చైర్మన్ అభ్యర్థి గా వైసీపీ ప్రతిపాదించింది. కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా మెజారిటీ ఓటింగ్ కలిగిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన గుంజ శ్రీనివాస్ ను చైర్మన్ అభ్యర్థి గా వైసీపీ ప్రకటించడం తో వడ్డెర కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇదే క్రమం లో వడ్డెర లపై టిడిపి అవలంభించిన నిరంకుశ వైఖరి తెరమీదకు వచ్చింది. అధికార వైసీపీ వడ్డెరలకు అధికార పీఠాన్ని కట్టబెట్టేందుకు సిద్ధం అయితే టిడిపి మాత్రం వడ్డెర లను నేల సీటుకు పరిమితం చేశారని వడ్డెర కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులో కూడా టిడిపి అణచివేత ధోరణి అవలంభించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ ఓటింగ్ ఉన్న వడ్డెర సామాజిక వర్గానికి టిడిపి ప్రాధాన్యత ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు.కోర్టులో తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తె వడ్డెర సామాజిక వర్గానికి చెందిన గుంజ శ్రీనివాస్ చైర్మన్ పీఠం పై కూర్చునే అవకాశం ఉంది.

రిపోర్టర్,సత్య..మైలవరం