అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం


 TV77తెలుగు శబరిమల :

శ‌బరిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి భ‌క్తుల ద‌ర్శ‌నానికి అధికారులు అనుమ‌తి ఇచ్చారు. నేటి నుంచి రోజుకు 30 వేల మంది భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్నారు. అయితే, అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు కోవిడ్ టీకా స‌ర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ త‌ప్ప‌నిస‌రిగా వెంట తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు. డిసెంబ‌ర్ 26వ తేదీతో అయ్య‌ప్ప మండ‌ల పూజ ముగియ‌నున్న‌ది. మండ‌ల పూజ అనంతరం మ‌క‌రజ్యోతి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో శ‌బ‌రిమ‌ల వ‌స్తారు. మ‌క‌రజ్యోతి పూర్తైన త‌రువాత జ‌ర‌వ‌రి 20వ తేదీన ఆల‌యాన్ని మూసివేయనున్నారు. క‌రోనా కార‌ణంగా నిబంధ‌న‌లను ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని అధికారులు తెలిపారు.