పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల


TV77తెలుగు రాజమహేంద్రవరం :

స్దానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి  ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు, గోరంట్ల మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పన్నులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని,ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తు మన రాష్ట్రంలో పెట్రోల్,డీజిల్  ధరలు బాదుడే బాదుడు అంటు ప్రక్క రాష్ట్రాలలో మనకంటే 7రూపాయలు తక్కువకు పోస్తున్నారు అని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యాట్ టాక్స్ ను పూర్తిగా రద్దు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి  మంగళవారం ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ 110.35 ఉంటే అందులో జగన్ రెడ్డి ప్రభుత్వం రూ"39.76  పన్ను వసూలు చేసుకుంటుందని దేశంలో కరోనా కష్టకాలంలో ప్రజలు ఇక్కట్లు పడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ప్రజలు పెట్రోల్, డీజిల్ భారంతో ఇబ్బందులు పడుతున్నారని,దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ప్రజలకు వెసులుబాటు కలిగిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్  ధరలు తగ్గించే చర్యలు చెపట్టకుండా తిరిగి పత్రికలలో ప్రకటనలు ఇచ్చి మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమని చెప్పిన ఘనత దేశంలో ఒక్క జగన్ రెడ్డి కే దక్కిందని అన్నారు,ధరలు తగ్గించాలని కోరుతూ పార్టీ శ్రేణులు మరియు స్థానిక వాహనదారులతో కలిసి నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు,మార్ని వాసు,గంగిన హనుమంతరావు,వెలుగుబంటి ప్రసాద్,మార్గాని సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.