TV77తెలుగు ఇబ్రహీంపట్నం :
ఎక్సైజ్ శాఖ ఎస్ ఐ గా పదోన్నతి పొందిన ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ ఆర్ దివాకర్....!!!
ఘన వీడ్కోలు పలకనున్న ఇబ్రహీంపట్నం ఎంపిపి పాలడుగు జ్యోత్స్న, మండల అధికారులు....!!!
నేడు మండల కార్యాలయం లో జరగనున్న సన్మాన సభ.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్....!!!
గడిచిన మూడేళ్ల కాలంలో ఇబ్రహీంపట్నం మండల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మండల అభివృద్ధి శాఖ అధికారి ఆర్.దివాకర్ ఎక్సైజ్ శాఖకు ఎస్ ఐ గా పదోన్నతి పొందారు. సాధారణ బదిలీ ప్రక్రియ కాకుండా పదోన్నతిపై ఆయన ఎక్సైజ్ శాఖకు నియమితులయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఆర్. దివాకర్ అనతి కాలంలోనే మండల ప్రజలకు, ఆయ రాజకీయ పార్టీల నేతలకు సుపరిచితులు అయ్యారు. అందరినీ కలుపుకొని వెళ్ళే స్వభావం కలిగిన అధికారిగా పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించేందుకు మండల ఎంపిపి పాలడుగు జ్యోత్స్న ఏర్పాటు చేశారు. ఈరోజు 4 గంటలకు ఇబ్రహీంపట్నం మండల కార్యాలయం లో జరిగే సన్మాన సభ కు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీఓ ఆర్.దివాకర్ ను ఘనంగా సత్కరించనున్నారు..
రిపోర్టర్ సత్య.. మైలవరం