గవర్నర్ తమిళిసైని కలిసిన స్టాండింగ్ కమిటీ సభ్యులు


 గవర్నర్ తమిళిసైని కలిసిన స్టాండింగ్ కమిటీ సభ్యులు

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని వినతి 

 TV77తెలుగు  తెలంగాణ :

ఉభయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ను టూరిజం, కల్చర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కోరారు. 24 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల పర్యటనలో భాగంగా తెలంగాణా గవర్నరు స్టాండింగ్ కమిటీ చైర్మన్ టిజి వెంకటేష్ సారధ్యంలో పార్లమెంట్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సిపి పార్లమెంట్ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ కు పుష్పగుచ్చం అందచేసారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఉన్న కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులు పర్యటించి అక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలను పరిశీలన చేస్తున్నామని వివరించారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరడంతో పాటు పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు.