TV77 తెలుగు రాజమహేంద్రవరం :
రాజకీయాలకు సంబంధంలేని నారా భువనేశ్వరిని అసెంబ్లీలో కించపరిచేలా మాట్లాడటం విచారకరమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తన రోజురోజుకు చిరాకు పుడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ అన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈరోజు కంటతడి పెట్టడం చూసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన చంద్రబాబునాయుడు సతీమణిని అవమానించేలా మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు తగదని అన్నారు.అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు నాయకుల కుటుంబ సభ్యుల జోలికి వెళ్తూ మనస్థాపానికి గురి చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజల మధ్యే నిలిచి పోరాటం చేయడానికి అసెంబ్లీని బహిష్కరించడం స్వాగతించదగిన విషయమన్నారు. తెలుగుదేశం ఎల్లప్పుడూ ప్రజల కోసమేనని, వైయస్సార్ కాంగ్రెస్ అరాచకాలకు తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.