పట్టించుకోని సర్పంచ్. అధికారులు.
TV77తెలుగు రాజానగరం:
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన పాలకవర్గాలు వచ్చిన పంచాయతీల దృష్టితి మారకపోగా ప్రధానంగా దళితులు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలు మురికి కోపంలో మగ్గుతున్నాయి. రాజానగరం మండలం సంపత్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ వాసులు గత సంవత్సర కాలంగా మురికి కుపాల మధ్యలో దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి గెలిచిన సర్పంచ్ పాలకవర్గం పంచాయతీ అధికారులు దళితుల పట్ల వివక్షత పాటిస్తున్నట్లు ఎస్సీ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు గత ఎనిమిది నెలలుగా ఎస్సీ కాలనీ శివారు. సబ్స్టేషన్ వద్ద అడుగు లోతు మురికినీటి చేరి చెరువు గా మారింది గ్రామంలోని మురికి నీరు ఎంత ఇక్కడికి చేరి డ్రైనేజీలు ఉండిపోయి దోమలు. పందులకు.పాములకు నిలయంగా మారింది. టైఫాయిడ్. కలరా. డెంగ్యూ ప్రమాదకర వ్యాధులు పడి దళితులు వారి పిల్లలు మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. 40 ఏళ్ల క్రితం వరకు సజావుగా సాగిన డ్రైనేజీ వ్యవస్థ సర్పంచ్గా ఎన్నికైన పెంటగట్ల రామకృష్ణ, సబ్స్టేషన్ వద్ద గ్రావెల్ మట్టితో కల్వర్టును వేయడం సమస్యకు దారి తీసిందని స్థానికులు. దళితులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై సచివాలయానికి పంచాయతీ అధికారులకు సర్పంచ్ కు చాలాసార్లు ఫిర్యాదు చేసినా దళితులని చులకనభావం గా చూస్తున్నారని ప్రవీణ్ కుమార్. చాపల అర్జమ్మ. గిరిబాబు తదితరులు వాపోయారు. ఇటీవల సచివాలయ సందర్శనకు విచ్చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని అధికారులకు పరిష్కరించమని సూచించారని అయితే మండల సర్వేయెర్. సర్పంచ్ కుమ్మక్కై సమస్యను దాటి వేస్తున్నారని దళితులు ఆరోపించారు. డ్రైనేజీ కూరుకుపోయి చెత్తాచెదారం ఇళ్ల ముందు నిలిచిపోతుందని మురుగునీరు వర్షపునీరు కలిసి ఇళ్లల్లోకి వస్తుందని పాముల భయం ఉందని అర్జమ్మ వాపోయింది. సబ్ స్టేషన్ పక్కనే ప్రభుత్వ స్థలం ఉందని సర్వే చేసి డ్రైనేజీ అవుట్లెట్ నిర్మించి సమీపంలో ఉన్న చెరువులోకి మురికినీటిని పంపించే వీలునప్పటికీ ఆ దిశగా సర్వేరు పంచాయతీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని దళితులు వాపోయారు. ఇకనైనా దళితులు ఎదుర్కొంటున్న మురుగు నీటి సమస్యను చెత్తాచెదారం తొలగించాలని విజ్ఞప్తి చేశారు.