సమరయోధుల పుస్తక ప్రదర్శన


  TV77తెలుగు  రాజమహేంద్రవరం

 సోమవారం ఉదయం పదిన్నర గంటల నుండి సీతంపేట శాఖ గ్రంధాలయం నందు స్వతంత్ర సమరయోధుల పుస్తక ప్రదర్శనలు మరియు స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు స్వతంత్ర సమరంలో నాయకుల పాత్ర అనే అంశంపై వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్  హై స్కూల్ నన్నయ్య మున్సిపల్ హైస్కూల్ ఏ పీ పీ ఎం స్కూల్ నాగరాజా మున్సిపల్ హైస్కూల్ పంతం సత్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్ సుమారు 120 మంది పిల్లలు పాల్గొనిరి విజేతలకు బహుమతులను 20వ తారీకు ముగింపు వేడుకల్లో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా టౌన్ హై స్కూల్ హెడ్మాస్టర్ కె రామలింగారెడ్డి  మరియు  సచివాలయం 38వ వార్డు అడ్మిన్  శేఖర్.  శర్మ . రాంబాబు.  సి ఆర్ పి లు ఇంగ్లీష్ సార్ మురళీకృష్ణ . ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీతంపేట గ్రంథాలయ అధికారి కే సుగుణ కుమారి. ఎం వీర లింగం డి రాజు  కార్యక్రమం నిర్వహించారు . రేపటి దినము 16 11 2021 స్వతంత్ర సమరంలో గ్రంథాలయాల పాత్ర గ్రంథాలయ ఉద్యమకారుల సంస్మరణ సభ జరుగును విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయంలో పై వక్తృత్వ పోటీలు జరుగుతాయి.