సమంత ప్రచార జోరు..!!! ప్రత్యర్థులు బేజారు...!!


 

TV77తెలుగు  కొండపల్లి:

ప్రచార హోరులో స్పీడు పెంచిన 17వ డివిజన్ జిజేపి కౌన్సిలర్ అభ్యర్ధి నందితా వర్మ ( సమంత)...!!!

సమంత స్పీడుకి ముగ్ధులు అవుతున్న పొలిటికల్ కేడర్..!!

కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల బిజేపి నేతలతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న సమంత...!!

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో నూతన ఒరవడి సృష్టించిన హిజ్రా నందితా వర్మ అలియాస్ సమంత ప్రచార జోరు కొనసాగిస్తున్నారు.ప్రచారం లో సమంత స్పీడుకి పొలిటికల్ లీడర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం తో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.బిజేపి తరుపున 17 వ డివిజన్ కౌన్సిలర్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న తనకు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విలువైన ప్రజా చేస్తానని సమంత స్పష్టం చేశారు.   రిపోర్టర్,సత్య..మైలవరం