ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఎస్పీ

 


TV77తెలుగు రాజమహేంద్రవరం :

అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి  గురువారం ప్రకాశం నగర్ పోలీసు స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసి పోలీసు స్టేషన్ పని తీరు, గ్రేవ్, మిస్సింగ్  కేసుల దర్యాప్తు, ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, విజిబుల్ పోలీసింగ్, ప్రజాసమస్యలు పరిష్కారం, పిటిషన్ మేనేజ్మెంట్, డయల్ 100 కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడం గురించి మరియు ఇతర అంశాలపై ఈస్ట్ జోన్ డిఎస్పీ ఎ.టి.వి.రవికుమార్ మరియు సి.ఐ  ఆర్.జె.రవికుమార్ లతో చర్చించారు.ఈ తనిఖీలో ఎస్పీ  స్టేషన్ రికార్డులను పర్శిలించి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినారు, అలాగే పాత UI కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని  తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్టేషన్ రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్ లను పరిశీలించి, స్టేషన్ కు వచ్చు ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి  సూచించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారికీ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సి.ఐ  తగు సూచనలు చేసినారు. ముఖ్యంగా చోరీ కేసులలో నిందితులను కనిపెట్టుటలొ ప్రత్యేక శ్రద్ధ చూపించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.

అలాగే స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి, పోలీస్ స్టేషన్ కు, డీఎస్పీ ఆఫీస్ గానీ, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ని కలసి ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కరించేలా చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం అని ప్రజలకు తెలియజేశారు.