అంతులేని అక్రమ నిర్మాణాలు


 TV77 తెలుగు   రాజమహేంద్రవరం రూరల్:

 15 అడుగుల రోడ్డులో అపార్ట్మెంట్ నిర్మాణం

అధికారుల అండదండలతో  

హుకుంపేట  పంచాయతీ లో అధికారులు, అండదండలతో భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.రాజమ హేంద్రవరం నగరాన్ని ఆనుకుని ఉన్న ఈ  పంచాయితీ లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.విజిలెన్స్ అధికారులు గతంలో అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇచ్చినప్పటికీ నేటికీ యధావిధిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉండటం గమనార్హం.హుకుంపేటలోని సావిత్రి నగర్,రామకృష్ణ నగర్ లో అనేక అక్రమ నిర్మాణాలు జరిగిపోతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.ఎందుకంటే రాజకీయ పైరవీలతో వచ్చిన కొంత మంది అధికారులు,అందునా ఎటువంటి అక్రమ నిర్మాణాలు జరిగినా కళ్లు మూసు కుంటున్నట్టు తెలుస్తోంది.ఈ పంచాయి తీలో  లే అవుట్ల ద్వారా పంచాయితీకి దఖలు పడిన కామన్ సైట్లు కూడా అన్యాక్రాంతమయ్యాయి.నగరాన్ని ఆనుకుని వున్న ఈ పంచాయితీలో ఇటీవల కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.ఈ మేరకు కోట్ల విలువ చేసే పంచాయతీ కామన్ సైట్లు ప్లాట్లుగా అన్యాక్రాంతమైనట్టు తెలుస్తోంది.దీనికి తోడు పంచాయతీ కామన్ సైట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాలకవర్గం లేని ఈ మేజర్ పంచాయతీలో ఆదాయం తన్నుకుపోతుంటే,అధికార పార్టీ అండదండలతో అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.ఈ పంచాయితీలో జీ ప్లస్ టు విధానంలో నిర్మాణాలకు అనుమతులు తీసుకుని  నాలుగైదు అంతస్తుల నిర్మాణాలు సాగిపోతున్నాయి.బాలాజీపేట నుండి హైవేకు వెళ్లే రహదారిలో జీ ప్లస్ టుకి అనుమతులు తీసుకుని యధేచ్చగా అదనపు అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు.దీనికి తోడు16 అడుగుల రోడ్లలో బహుళ అంతస్తులకు అనుమతి ఇవ్వకూడదు.కానీ చిన్న కచ్ఛా రోడ్ ను ఆనుకుని నాలుగు అంతస్తుల భవనం అక్రమంగా నిర్మిస్తున్నారు. పంచాయితీ అధికారులకు తెలిసినా.. ముడుపుల మత్తులో అక్రమ నిర్మాణాలకు తావిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పంచాయతీ కార్యదర్శి కాశీవిశ్వనాధ్ ను వివరణ కోరగా ఈ భవన నిర్మాణ అనుమతులు తన హయాంలో మంజూరు చేయలేదని,క్షేత్ర స్థాయిలో పరిశీలించి,అక్రమ నిర్మాణం చేపడుతున్న భవన యజమానికి నోటీసులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయట పడతాయని,పంచాయతీ ఆదాయం కూడా పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై వుందని ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నాయి.