TV77తెలుగు అమరావతి :
ఏపీ పోలీస్ శాఖను సీఎం వైఎస్ జగన్ మనస్పూర్తిగా అభినందించారు. ఇదే రీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి ఈ ప్రస్ధానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ ఉన్నతాధికారులు కలిశారు. స్మార్ట్ పోలీసింగ్ సర్వే రిపోర్ట్‌ను సీఎంకి అందజేసి వివరాలు వెల్లడించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీకి నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడించింది. స్మార్ట్ పోలీసింగ్‌పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సర్వే నిర్వహించిన ఇండియన్ పోలీస్ ఫౌండేషన్. తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో సర్వే చేశారు. 2014 డీజీపీల సదస్సులో స్మార్ట్ పోలీసింగ్ పద్దతులను పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.దీంతో ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్ పోలీసింగ్ నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే చేశారు. ఏడేళ్ళుగా నిర్వహిస్తున్న సర్వేలో తొలిసారిగా మొదటి ర్యాంకును ఏపీ పోలీస్ శాఖ సాధించింది. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపిఎఫ్ సర్వే నిర్వహించింది. ఐపిఎఫ్‌లో సభ్యులుగా రిటైర్డ్ డీజీలు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌర సమాజానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు.