TV77తెలుగు కొండపల్లి:
కొండపల్లి పురపోరులో అత్యధిక ప్రాధాన్యత సంతరిచుకున్న అభ్యర్థి ఎంపిక...!!!
వార్డుల వారీగా బలమైన అభ్యర్థులను జల్లెడ పడుతున్న ప్రధాన పార్టీలు...!!!
సీట్లు దక్కని వారు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి...!!
ప్రతిష్టాత్మక పుర పోరులో ప్రత్యర్థిని పడగొట్టి నెగ్గలంటే వార్డుల వారీగా ఆయ రాజకీయ పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. అభ్యర్థి ఎంపికలో ఏ మాత్రం తప్పిదాలు జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల ఎంపిక కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఎవరు ఉంటారు అనే ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో అధినేతలకు అభ్యర్థి ఎంపిక కత్తి మీద సాము లా మారింది అనే చెప్పాలి. జరగబోయే ఎన్నికల్లో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం పోటీ చేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఈ క్రమం లో పార్టీల వారీగా ఓట్లు చీలిక ఈ సారి భారీగానే ఉంటుందనే అంచనాలు ఉనాయి.అందులో భాగంగానే అభ్యర్దిని చూసి పడే ఓట్లు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఈ ప్రభావం అధికార పార్టీ పై కూడా ఉండే అవకాశం లేకపోలేదు.ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపిక పై సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా అభ్యర్దిని చూసి ఓట్లు వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పార్టీల వారీగా కొంత ప్రభావం ఉన్న నేపథ్యంలో ఓటరు నాడి పసిగట్టడం కొంత మేర సాద్యపడటం తో కొంత మేర ఆ దిశగా కూడా అన్ని రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే అభ్యర్థి ఓటు పని చేస్తుందా లేక పార్టీ ముద్ర పట్టం కడుతుందా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
రిపోర్టర్, సత్య .. మైలవరం