అయోమయంగా పబ్లిక్ పల్స్

TV77తెలుగు కొండపల్లి:

అన్ని పార్టీల అభ్యర్థుల పల్స్ రెట్ పడేస్తున్న ఓటరు అంతరంగం...!!!

అంతుచిక్కని కొండపల్లి మున్సిపాలిటీ ఓటరు నాడి....!!!

ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి..!!

సాధారణంగా ఎన్నికల సమయంలో ఆయ పార్టీల బల బాలలను బట్టి అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని బట్టి పైబ్లిక్ పల్స్ అంచనా వేయడం జరుగుతుంది. అంతే కాకుండా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. ఏ వార్డులో ఎవరు విజయం సాధించగలరు అనేది సాధారణ పౌరుడు సైతం ఒక అంచనాకు రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఆ అంచనాలు సైతం తల్లకిందులు అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది రాజకీయ విశ్లేషకులు ఒక అంచనాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బరిలో ఉండగా స్వతంత్ర అభ్యర్థులు సైతం అధిక సంఖ్యలో పోటీ లో ఉండటమే ప్రధాన కారణం గా కనిపిస్తోంది. సాధారణంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించిన చరిత్ర కొండపల్లి కి ఉండటం తో ఏ పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ వార్డులో ఎవరు గెలవగలరు అనేది స్పష్టత రావడం లేదు. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటి అంటే స్వతంత్ర అభ్యర్థులు పోటీ లేని చోట పలానా పార్టీ అభ్యర్థి గెలవగలడు అనే ఒక అంచనా వేసుకోవడం అయా పార్టీలకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబడిన స్థానాల్లో మాత్రం స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడం లేదు. ఇటీవల అధికార పార్టీ పై నెలకొన్న ప్రజా  వ్యతిరేకత తమకు కలిసొస్తుంది అని ప్రతిపక్ష పార్టీలు బావిస్తున్నప్పట్టికి ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రచార పర్వం సైతం మరో రెండు మూడు రోజుల్లో ముగుస్తుండగా పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఓటరు నాడి పట్టలేక పోవడం చెమటలు పట్టిస్తోంది. ఓటర్లు సైతం ఆయా రాజకీయ పార్టీలపై తమ అంతరంగాన్ని బహిర్గతం చేయకపోవడం తో ఈ సారి సైలెంట్ ఓటింగ్ అనివార్యం లా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే అత్యంత కీలకమైన ఓటరు నాడి పసిగట్టలేక పోవడం అభ్యర్థులకు కొత్త చిక్కులు తప్పవు అనేది స్పష్టం అవుతుంది.  విశ్లేషణాత్మక రిపోర్ట్

రిపోర్టర్,సత్య.. మైలవరం