TV77తెలుగు కడియం :
54 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మూడవరోజు కడియం శాఖ గ్రంథాలయంలో అజాదీ కా అమృత్ మహోత్సవం కొనసాగిస్తూ గ్రంథాలయాల ఉద్యమకారుల సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించి. స్వాతంత్ర సమరయోధుల వారసులకు ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ ప్రముఖ న్యాయవాది తోటి వసంతరావు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమరయోధుల వారసులకు ఘనంగా సత్కరించారు. మరో అతిథి దేవరపు నీలకంఠం మాస్టారు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల వారసులకు సత్కారం కడియం గ్రంథాలయంలో చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నామని భావితరాలకు మనం ఆదర్శంగా ఉండాలని తద్వారానే నవ సమాజ నిర్మాణం జరుగుతుందని నీలకంఠ అన్నారు . 54వ గ్రంథాలయ వారోత్సవాలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమని అన్నారు . గ్రంథాలయ ఉద్యమకారుల చిత్రపటానికి పూల మాల జ్యోతిప్రజ్వలన చేసి విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ని శెట్టిపల్లి శ్రీదేవి . నిర్మల భార్గవి. స్వప్న . జి సత్యనారాయణ మాస్టారు. న్యాయనిర్ణేతగా వ్యవహరించారు వంద మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.