TV77తెలుగు రామచంద్రాపురం:
తూర్పగోదావరి జిల్లా రామచంద్రాపురం డిఎస్పీ కార్యాలయంలో ఉత్తమ సేవలు అందించిన సేవాతర్పరులను డిఎస్పి బాలచంద్రారెడ్డి చేతుల మీదగా సత్కరించారు. ఈ సేవాతర్పరులలో బిక్కవోలుమండలం నుండి 4 గురు ఉండటం బిక్కవోలు మండలం గర్వపడవలసిన విషయం. ఈ సందర్బంగా బిక్కవోలు ఎస్సై వాసు మాట్లడూతూ కరోనా సమయంలో మండలంలోని పోలిస్ వారితో పాటు ఉత్తమ సేవలు అందించిన దాసరి సూరిబాబు అటోడ్రైవర్,దూలిపూడివీరబాబు పెయింట్ వర్కర్,తాతాజీ బిక్కవోలు సంచవాలయం4 లో వాలంటీర్,మాసాబత్తుల వీరబాబు పెయింట్ వర్కర్,లను గుర్తించి వారిని సత్కరించడం జరిగిందని వారిలో అటో డ్రైవర్ సూరిబాబు గత28 ఏళ్ల గా అటో నడుపుతూ గర్భిణులకు ముసలివారికి ఉచిత సేవలు అందిస్తున్నారని అదేవిధంగా మిగిలిన ముగ్గురు కూడా కరోనా కష్టకాలంలో వీళ్ళు అందించిన సేవలు గుర్తించి డిఎస్పీ వారి చేతుల మీదుగా సత్కరించడం జరిందని తెలిపారు.