లేని ఓటు ఉన్నట్లు టిడిపి మైండ్ గేమ్....!!!

TV77తెలుగు కొండపల్లి: 

దొంగ ఓటు తెచ్చుకోవడం ప్రజాస్వామ్యమా...??

 లేని ఓటును తెచ్చుకున్న టిడిపి ఎంపి కేశినేని నాని....!! 
 
 కుట్రపూరితంగా వ్యవహరింటిడిపిచడం వలనే కౌన్సిల్ లో వ్యతిరేకించాం...!! 
 
కోర్టుకు నిజాలు దాచిపెట్టి ఓటు తెచ్చుకున్నారు..!! అవసరం అయితే తాము కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం... 
 
మీడియా తో కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ కౌన్సిలర్ జోగి రాము...!! 

కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ కొలువుల ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది.టిడిపి ఎక్సోఫిషియ ఓటు చుట్టు తిరుగుతున్న కొండపల్లి మున్సిపాలిటీ రాజకీయం దిన దినం ఉత్కంఠ నడుమ కొనసాగుతోంది.నిన్న జరిగిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నాటకీయ పరిణామాల నడుమ వాయిదా పడింది.అయితే నేడు మళ్ళీ ఈ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో కొండపల్లి వ్యాప్తంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది.వైసీపీ అరాచకం సృష్టిస్తున్నారు అంటూ టిడిపి ఎంపి కేశినేని నాని నిన్న వాఖ్యనించారు.ఈ నేపథ్యంలో ఇదే అంశం పై కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ జోగి రాము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లేని ఓటును సృష్టించి దొడ్డి దారిన పాలకవర్గం ఏర్పాటు చేయాలని టిడిపి కుట్ర చేస్తుందని మండిపడ్డారు.అసలు ఎంపి కి కొండపల్లి లో ఓటు లేదని అయినా సరే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ కోర్టులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఆరోపించారు.ప్రజాస్వామ్య బద్ధంగా ఎం జరిగినా తాము సమర్ధిస్తామని అల జరగలేదు కనుక నిన్న కౌన్సిల్ లో తీవ్రంగా వ్యతిరేకించామని తెలిపారు.ఇప్పటికైనా తాము ఒప్పుకునేది లేదని అవసరం అయితే న్యాయపోరాటానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. 
రిపోర్టర్,సత్య.. మైలవరం