ఎస్సీ వర్గకరణ సాధనే లక్ష్యంగా.!!


 TV77తెలుగు ఇబ్రహీంపట్నం :

ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 30న చలో విజయవాడ...!!!

ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ, మాదిగ హక్కులను సాధించుకోవాలి...!!

ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే విధంగా మంద కృష్ణ మాదిగ చర్యలు..!!

అత్యున్నత న్యాయస్థానం లో మాదిగల వాదన వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ ను ప్రభుత్వమే నియమించాలి.!!

ఇబ్రహీంపట్నం జర్నలిస్టుల ఐక్య వేదిక కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో ఏపి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెరుపోగు వెంకటేశ్వరరావు ఉద్ఘాటన..!!!

జిల్లా, మండలం ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి చలో విజయవాడ పోస్టర్ విడుదల...!!

మాదిగ హక్కులు, ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా మాదిగలు ఒక్కతాటి మీదకు రావాల్సిన అవసరం ఉందని ఏపి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం జర్నలిస్టుల ఐక్య వేదిక జిల్లా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎస్సీ వర్గీకరణ అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.అనాదిగా మాదిగలకు జరుగుతున్న అన్యాయం పై మన గళం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధన ఉద్యమాన్ని పక్కదారి పట్టించే విధంగా మంద కృష్ణ మాదిగ చర్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ సాధన లో కుల మతాలకు అతీతంగా మేదావులు అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం జిల్లా, మండల ఏపి ఎమ్మార్పీఎస్ నేతల ఆధ్వర్యంలో చలో విజయవాడ పోస్టర్ విడుదల చేశారు. 

రిపోర్టర్ , సత్య..మైలవరం