TV77తెలుగు కొండపల్లి :
కొండపల్లి టిడిపి నేతల్లో అంతర్ మధనం...!! తెలుగు తమ్ముళ్ళ కష్టానికి ప్రతిఫలం అణచివేత...!!!
నాడు నామినేషన్ల వేయడానికి ముందుకు రాని వారు నేడు అధికార పీఠం కోసం లాభియింగ్ షురూ...!!!
కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి నేతల్లో రగులుతున్న అసంతృప్తి సెగలు....!!!
చైర్మన్ అభ్యర్థి ఎంపిక లో వివక్ష చూపుతున్నారు అంటూ రేసులో ఉన్న వారు భావోద్వేగం..!!
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు ఎంత ఉత్కంఠ భరితంగా సాగాయో అంతే నరాలు తెగే ఉత్కంఠ ఫలితాల్లో కూడా కొనసాగింది.ఫలితాల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం తో ఆయ పార్టీల అధినాయకులు వ్యూహ రచన మొదలు పెట్టారు.అయితే అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి టిడిపి లో చేరడం తో సభ్యుల సంఖ్యా బలం తో టిడిపి శ్రేణులు కౌన్సిల్ లో చక్రం తిప్పడానికి సిద్ధం అయ్యారని ప్రచారం జరుగుతుంది. అయితే పాలకవర్గం ఎవరు ఫాం చేస్తారు అనే అంశం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు.కానీ టిడిపి శ్రేణులు కొండపల్లి కైవసం చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అది కాస్త ముదిరి పాకన పడి చైర్మన్ అభ్యర్థి ఎంపిక దాకా వెళ్లింది.ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఇప్పటి దాకా తెలుగు తమ్ముళ్లు కలిసి పని చేసినప్పటికీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయం లో అసంతృప్తి సెగలు రగులుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పార్టీకి విధేయత పని చేయడం తో పాటు టిడిపి కష్ట కాలంలో కూడా వెన్ను దన్నుగా నిలబడిన నేతలు ఉన్నారు.అయితే అధికార వైసీపీ హవా లో కూడా టిడిపి తరుపున తమ గళాన్ని బలం గా వినిపించిన నేతలు ఇప్పుడు కౌన్సిలర్ల గా గెలిచారు.ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు ముగిశాక అనూహ్యంగా తెర మీదకు టిడిపి పాలక వర్గం ఏర్పాటు కాబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే తెలుగు తమ్ముళ్లు మద్య చైర్మన్ ఎవరా అన్న అంశం పై చిచ్చు రాజేసింది అనేది స్పష్టం అవుతుంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పార్టీ విస్మరిస్తుందని కొందరు టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పార్టీ లో అనాదిగా కొనసాగుతున్న అనిచివేత దోరణి మళ్ళీ బుసలు కొడుతుందని తెలుగు తమ్ముళ్లు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన వారిని పక్కన పెట్టీ చైర్మన్ పదవి కోసం లాబీయింగ్ చేయడం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే టిడిపి లో చిలికి చిలికి గాలివానగా మారుతున్న అసంతృప్తి సెగలు రగులుకుంటే పార్టీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది అనేది టిడిపి సానుభూతి పరుల వాదన... ఇక్కడ ఇంకో ఆసక్తి కర విషయం ఏమిటి అంటే అసలు పాలక వర్గం ఇంకా ఏర్పాటు కాలేదు కానీ టిడిపి నేతల లాబీయింగ్ జరగడం గమనార్హం.
టిడిపి ఎత్తుగడ పై మరో కథనం జర్నలిస్టుల ఐక్య వేదిక ద్వారా మీ కోసం మరి కొద్ది గంటల్లో
రిపోర్టర్,సత్య..మైలవరం