తిష్ట వేసిన పారిశుద్ధ్య కార్మికులు..!!


 

TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్ :

రూరల్ పంచాయతీల్లో ఏళ్లతరబడి తిష్ట వేసిన పారిశుద్ధ్య కార్మికులు..!!

పంచాయతీ అధికారులను శాశిస్తూ చక్రం తిప్పుతున్న వైనం..!!

పట్టించుకోని ఉన్నత అధికారులు..!!

రరూల్ మండలంలోని పంచాయితీల్లో దశాబ్దాల తరబడి పారిశుద్ధ్య. కాంటాక్ట్. సిబ్బంది తిష్ట వేయడంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారయింది. వీరుస్థానికంగా కుల పరంగా రాజకీయ పరంగా అండదండలు ఉండడంతో పంచాయతీ కార్యదర్శులను  లెక్క చేయని తనం తలెత్తుతుంది. మండలంలో కోలమూరు. కాతేరు. తొర్రేడు, బొమ్మూరు. ధవలేశ్వరం. రాజవోలు. సాటిలైట్ సిటీ. హుక్కంపేట. పిడింగొయ్యి గ్రామాల్లో స్థానికంగా నియమితులైన పారిశుద్ధ్య సిబ్బంది ప్రభుత్వ పరంగా కాంట్రాక్ట్ విధానంలో నియమితులైన కాంట్రాక్ట్ కార్మికులు పారిశుద్ధ్య పనుల్లోనూ. కరెంటు. మంచినీటి సరఫరా పనుల్లో విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. రాజకీయ పరంగా స్థానికంగా కుల పరంగా రాజకీయ పరంగా వీరికి పట్టు ఉండడంతో సంబంధిత పంచాయతీ కార్యాలయాలకు రాకుండానే వచ్చినట్లుగా మస్తర్ వేసుకోవడం. విధులు ఎగ్గొట్టడం యదేచ్ఛగా  జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల ఆదేశాలను పట్టించుకోకపోవడం కనీసం జవాబుదారితనం లేకుండా సర్వీస్ రూల్స్ ను అతిక్రమించి ప్రైవేట్ కార్యకలాపాలు చూసుకోవడం పరిపాటిగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. వీరి పనితీరు గురించి ప్రభుత్వ ఆదేశాలను విక్రయించిన సంఘటనలపై పంచాయతీ కార్యదర్శులు అడుగుతుంటే అలాంటి వారిపై స్థానిక రాజకీయ నాయకుల అండతో అధికార పార్టీ నాయకులకు. ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేయడం కార్యదర్శులను బెదిరింపులకు గురి చేస్తున్న సంఘటనలు  కోలమూరు.పిడింగొయ్యి. ధవలేశ్వరం. సాటిలైట్ సిటీ. రాజవోలు గ్రామాల్లో చోటుచేసుకున్నాయని తెలుస్తుంది. ఈ గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు ఏళ్ల తరబడి తిష్ట వేసిన సిబ్బందితో లోపాయికారి సంబంధాలు కలిగి ఉండడంతో పంచాయతీ కార్యదర్శులను లెక్క చేయడం లేదండి వారి ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శలు వస్తున్నాయి.  

వీరు నిర్వర్తించాల్సిన  విధులను నిర్లక్ష్యం చేయడంతో ఆయా గ్రామాల్లో వీధులు, రోడ్లు, పరిసరాలు ఆపరిశుభ్రంగా, డంపింగ్ యార్డ్ చెత్త కుప్పలుగా మారుతున్నాయి.  అన్ని  గ్రామాల్లోనూ విద్యుత్ సౌకర్యం అంతంత మాత్రం గా, విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి ని,  రక్షిత మంచినీటి ట్యాంకల వద్ద ఆ పరిశుబ్ర వాతవరణం, లీకేజీలు ఏర్పడి మురికి గుంటలు తలపిస్తున్నాయని స్థానికులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజమండ్రి కార్పొరేషన్లో విలీనం సమస్యను అడ్డంపెట్టుకుని తిష్ట వేసిన సిబ్బంది మరింతగా  రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆయా గ్రామాల్లో ఇప్పటివరకు పర్యవేక్షణచేసే  ప్రత్యేక అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు  తిష్ట వేసిన సిబ్బందిని బదిలీలు చేసి స్థానిక గ్రామాల ప్రజలను వీరి అలసత్వం నుంచి రక్షించాలని, గ్రామాల్లో పరిశుభ్రంగా, రక్షిత మంచినీటి సరఫరాను , విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల  ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.