వీఆర్వో గౌస్ మృతిపై కాల్ మనీ నీడ....!!!


 TV77తెలుగు ఇబ్రహీంపట్నం :

కాల్ మనీ వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం...!!

ఇబ్రహీంపట్నం విర్ఓ గా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మృతుడు గౌస్...!!

అప్పుల బాధ తాళలేక సూసైడ్ లెటర్ రాసి ఆతహత్యకు పాల్పడినట్లు చెబుతున్న స్థానికులు....!!!

సమగ్ర దర్యాప్తు చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు..!!

ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ విఆర్వో గా పని చేస్తున్న గౌస్ ఆత్మహత్య కు కాల్ మనీ నీడలు కమ్ముకున్నాయి. అప్పుల బాధలు తాళలేక, చేసిన అప్పుకు వడ్డీ లు చెల్లించుకోలేక తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు గౌస్ సూసైడ్ నోట్ రాసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఇదే గౌస్ పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంగా స్థలాలు ఇప్పిస్తానని వేలల్లో, లక్షల్లో వసూల్ చేసినట్లు మండల అధికారులకు పిర్యాదులు అందాయి. అంతేకాకుండా గతంలో గౌస్ పై సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వసూల్ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు పట్టుపట్టడం తో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. గౌస్ మృతి తో ఇబ్రహీంపట్నం వ్యాప్తంగా మళ్ళీ కాల్ మని బుసలు తెర మీదకు వచ్చాయి. కొండపల్లి, ఇబ్రహీంపట్నం లో  కాల్ మని బిజినెస్ మళ్ళీ విస్తృతంగా జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. చిరు వ్యాపారులు దగ్గర నుండి , కులీ నాలి చేసుకునే వారి ప్రాణాలు తోడేస్తున కాల్ నాగుకు చివరకు ప్రభుత్వ ఉద్యోగులను సైతం వదలడం లేదనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న కాల్ నాగుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

రిపోర్టర్,సత్య..మైలవరం