మైనార్టీల సంక్షేమమే జగన్ ధ్యేయం


 TV77తెలుగు రాజమండ్రి :

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ 'జకీయా'కు అభినందనలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గాగా ముస్లిం ఎమ్మెల్సీ జకియా ఖానము నియమించడంపై వైఎస్ఆర్ సిపి మైనార్టీ నాయకులు, జిల్లా ముస్లీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నిజాం హర్షం వ్యక్తం చేసారు. మైనార్టీల అభివృద్ధికి జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని నిజామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పలువురు ముస్లిం నాయకులతో కలిసి జకియా ఖానమ్ను కలిసి అభినందనలు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ కార్యకర్త స్థాయి నుంచి వైఎస్ఆర్సిపిలో పనిచేస్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన కొయ్యా మోషేన్ రాజుకి ఎమ్మెల్సీ పదవి కేటాయించి శాసనమండలి చైర్మన్ నియమించడం అభినందనీయమన్నారు. దళిత, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఆయన కేటాయించిన పదవుల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఒక మంచి సందేశం పంపారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని వాగ్ధానాలను నేరవేర్చడానికి జగన్ కృషిచేస్తున్నారని తెలిపారు. మైనార్టీ సబ్ ప్లాన్తో పాటు దుల్హన్ పథకం, విదేశీ విద్య పథకాన్ని కూడా అమలు జరిగేలా చూడాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్కు విజ్ఞప్తి చేసామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల్లో జగన్ నిర్ణయంతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను జగన్ నేరవేర్చడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఏ సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేయాలో ఆ మేరకు అన్ని నిర్ణయాలను జగన్ తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ముస్లింలు తల ఎత్తుకుని జీవించేలా సిఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిమ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ షబ్బీర్, తాళ్ళపూడి నియోజక వర్గం మైనారిటీ అధ్యక్షులు సర్దార్, అమీర్ పాషా, మహమ్మద్ అక్రమ్, రమీజ్ తదితరులు పాల్గొన్నారు.