తల బొప్పి కట్టిస్తున్న ఇండిపెండెంట్లు


 

TV77తెలుగు  కొండపల్లి :

కొండపల్లి పురపాలక ఎన్నికల్లో ఓట్ల చీలికల పర్వం కొనసాగుతుందని అంచనా...!!

కీలకమైన కొన్ని వార్డుల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులకు పోటీ ఇవ్వనున్న స్వతంత్ర అభ్యర్థులు...!!

ఓట్ల చీలిక జరిగితే ఫలితాలు తారుమారు అవుతాయని అభ్యర్థుల తర్జన భర్జనలు...!!

ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల మద్య పోరు జరుగుతున్న క్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతాల్లో పలు కీలకమైన డివిజన్ల లో ఈ ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది.రాజకీయ పార్టీలైన వైసీపీ, టిడిపి, జనసేన మద్య ప్రధాన పోటీ నెలకొనగా మధ్యలో కొన్ని డివిజన్ల లో ఆయా పార్టీల అభ్యర్థులకు స్వతంత్రుల  సెగ తగులుతోంది. దీంతో ఓట్ల చీలిక జరుగుతుంది అనే ఆందోళన మొదలైంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వం లో ప్రధాన రహదారులకు అధిక సమయం కేటాయించగా స్వతంత్ర  అభ్యర్థులు ఇంటింటి కి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో ఫలితాలు తారు మారు అవుతాయని అభ్యర్థులు తర్జన భర్జనలు పడుతున్నారు.. ఇంకా కొన్ని ప్రధానమైన డివిజన్ల లో అధికార పార్టీ కి సైతం పోటీ ఇచ్చే రేంజ్ లో ఇండిపెండెంట్ లు పావులు కదుపుతున్నారు. యువతను ఆకట్టుకోవడం, సోదర భావం తో అందరిలో కలిసి పోవడం వంటి వ్యూహాలు అమలు చేస్తూ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చేది సిద్ధం అవుతున్నారు.అయితే ప్రధాన రాజకీయ పార్టీల పోటీల నడుమ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంత మేర ద్యమేజి చేయగలరు అనేది తేలాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.    రిపోర్టర్,సత్య.. మైలవరం