TV77తెలుగు కొండపల్లి :
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్.
ఒకటో వార్డు లో బాక్సులు మార్చారని స్వతంత్ర అభ్యర్థి ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాలెట్ బాక్స్ లు తెరవడం లో కొంత ఆలస్యం కావడం తో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాలేదు. అయితే బాక్స్ లు తెరిచే క్రమం లో కొండపల్లి శాంతినగర్ 1 వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి ప్రసాద్ కొంత అనుమానం వ్యక్తం చేశారు. బాక్సులకు సంభందించి అన్ని బాక్స్ లకు బ్లూ మార్క్ ఉండి ఒక్క బాక్స్ కి రెడ్ మార్క్ చేయడంపై అభ్యంతరం పెట్టారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యింది. అయితే వాదన సద్దుమనగడం తో ఎట్టకేలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు.
రిపోర్టర్,సత్య..మైలవరం