ఉద్యమకారుడి మరో అంశ...!!


TV77తెలుగు  కొండపల్లి :

పోరాటాల కేంద్ర బిందువు లో  అలుపెరుగని జనసైనిక సమిధలా మారనున్న చేరుకుమల్లి రాధిక...!!!

కొండపల్లి మున్సిపాలిటీ ఉద్యమాల్లో మెరవనున్న మరో ఉద్యమ తార....!!

పురపోరులో 28వ వార్డు నుండి ప్రజా క్షేత్రంలో యుద్దానికి సిద్ధమైన జనసైనికురాలు...!!!

కొండపల్లి మున్సిపాలిటీ సమస్యలపై తన గళం వినిపించిన జన సైనికుడు చెరుకుమల్లి సురేష్ బాటలోనే నడిచేందుకు ఆయన సతీమణి చెరుకుమల్లి రాధిక సిద్ధం అయ్యారు. ప్రతిష్టాత్మక కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో తన బలం ఎంతో నిరూపించుకునేందుకు ప్రజా సమస్యలపై వాగ్బాణాలు ఎగ్గు పెట్టారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల కోసం తాను అవలంభించే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. విద్యా వంతురాలు కావడం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే చెరుకుమల్లి సురేష్ సతీమణి కావడం ఆమె గెలుపుకు బాటలు వేస్తుందని ధీమా తో ప్రజల్లోకి వెళుతున్నారు..ప్రజా సమస్యలపై పోరాడే కుటుంబం కావడం తో ఆమె కు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. 

రిపోర్టర్  , సత్య.. మైలవరం