TV77తెలుగు కొండపల్లి :
నమ్మి ఓట్లు వేశారు.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ...!!!
సంకల్ప సిద్దితో కొనసాగుతున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సుపరిపాలన....!!!
ఇంటింటికీ తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాధించుకొచ్చిన అపర భగీరథుడు ఎమ్మెల్యే వసంత....!!!
కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటి కుళాయి పథకం అమలుకు 52 కోట్లు మేర నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం...!!!
దశాబ్దాల చరిత్ర కలిగిన ది గ్రేట్ రాయల వారి ఆస్థానం ఎమ్మెల్యే వసంత పాలనలో దిన దిన అభివృద్ధి సాధిస్తుంది. కొండపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాలను మున్సిపాలిటీ గా మార్చి అభివృద్ధికి పునాది వేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మరో భగీరథ అస్త్రం తో ప్రజలకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి తన నియోజకవర్గ సమస్యలపై సుదీర్ఘ వివరణ ఇచ్చి అభివృద్ధికి పూల బాటలు వేశారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో దశాబ్దాల నాటి చిరకాల స్వప్నం గా మిగిలిపోయిన ఇంటింటికీ తాగునీటి కుళాయి పథకానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం 52 కోట్లు మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వంచే విడుదల చేయించుకోవడం లో సఫలీకృతం అయ్యారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇంటింటికీ తాగునీటి కుళాయి పథకం అమలులోకి రానుంది. గడిచిన పదేళ్ల కాలంలో దీర్ఘకాల సమస్యలుగా మిగిలిపోయిన ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపుతూ అపర భగీరథుడు వలె కొండపల్లి మున్సిపాలిటీ దాహార్తిని తీర్చబోతున్నారు.
రిపోర్టర్ , సత్య. మైలవరం