TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్ :
రాజమహేంద్రవరం అర్బన్, ప్రకాష్ నగర్, రాజమండ్రి డయగ్నాస్టిక్ ల్యాబ్ డాక్టర్ బిక్కిన రామ్మోహన్ రావు నివాసంలో జరిగిన దొంగతనం గురించి పిర్యాది అయిన బిక్కిన సరోజినీ ది 31.10.2021 తేదీన రాత్రి సుమారు 9.45 నిమిషాల సమయమలో ఇంటి పనులు ముగించుకుని లైట్ లను ఆర్పీ నిద్రపోవడానికి బెడ్రూం లోనికి వెల్లుచుండగా ఆమె వెనుక నుండి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఫిర్యాది పై ముసుగు కప్పి బెడ్రూం లోనికి తీసుకుని వెళ్ళి ఆమెను చంపుతామని బెదిరించి, బీరువా తాళం తీసుకుని బీరువ లోని సుమారు 15 లక్షల నగదు మరియు సుమారు 376 గ్రాముల బంగారు ఆభరణములను తీసుకుని ఫిర్యాదిని బెడ్రూంలో ఉంచి గది బయట నుండి తాళం వేసి దొంగిలించిన వస్తువులతో పారిపోయినట్లు ఇచ్చిన పిర్యాదు మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ కేసు ప్రతిష్టను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ప్రత్యేక బృందాలుగా ఈస్ట్ జోన్ డి.ఎస్.పి, ఎ.టి.వి.రవికుమార్ నేతృత్వంలో ఇనస్పెక్టర్లు ఆర్.జె.రవి కుమార్, యం.వి.సుబాష్, మరియు శ్రీమతి కె.మంగాదేవి గార్లను ఏర్పాటు చేసి అన్ని కోణాలలో క్షుణంగా, సైంటిఫిక్గా దర్యాప్తు చేసి, దర్యాప్తులో రాబడిన సమాచారం మేరకు ది. 03.11.2021వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్ నందు పై దొంగతనం కేసులో ముగ్గురు ముద్దాయులైన 1) కందుకూరి వెంకటేష్ s/o నరసయ్య, A/26, C/SC-మాదిగ, SC కాలనీ, రఘుదేవపురం గ్రామం, సీతానగరం మండలం, ప్రస్తుతం వాంబే గృహాలు, ఆవ రోడ్, రాజమహేంద్రవరం, 2) పడమట్ల దుర్గా గణపతి s/o సోమరాజు, A/26, C/SC-మాదిగ, D.No.41-2-112,, మున్సిపల్ స్కూల్ వెనుక వీధి, వీరభద్రనగర్, తాడితోట, రాజమహేంద్రవరం. 3) షేక్ శ్రీనివాస్ s/o హుస్సైన్, A/23, C/SC-మాదిగ, D.No.41-2-130, మున్సిపల్ స్కూల్ వీధి, వీరభద్రనగర్, తాడితోట, రాజమహేంద్రవరం, అను వారిని అరెస్ట్ చేసి విచారించగా, సుమారు 9 నెలల నుండి సదరు ఇంటి యజమాని వద్ద డ్రైవరు గా పనిచేయుచున్న కందుకూరి వెంకటేష్ తన తోటి స్నేహితులతో కలసి పక్కా ప్లాన్ ప్రకారం ఇంటిలో దొంగతనం చేసినామని అంగీకరించగా, సదరు కేసుకు సంబంధించి చోరి సొత్తు 375 గ్రాములు బంగారం వస్తువులును మరియు Rs.8,40,000/- నగదును వారి వద్దనుండి స్వాధీనపర్చుకొని సదరు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడమైనది. ఈ కేసును త్వరితగతిన చేదించి ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషిచేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అభినందించారు.